జోహానెస్‌బర్గ్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా 358 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 531 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ వెట్టోరి (46 నాటౌట్), ఆల్‌రౌండర్ ఓరాం (40) మినహా మరెవ్వరూ రాణించకపోగా, ప్రోటీస్ బౌలర్లలో స్టెయిన్ తొలి ఇన్నింగ్స్ తరహాలోనే ఐదు వికెట్లు పడగొట్టి, కివీస్ పతనాన్ని శాసించగా.... మ్యాచ్ మొత్తంపై పది వికెట్లు పడగొట్టిన అతనే "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్"గా కూడా ఎంపికయ్యాడు.
గిబ్స్ (63), బౌచర్ (43)లు రాణించడంతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 226 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 118 పరుగులకే ఆలౌటైంది. అయితే ఆమ్లా (176 నాటౌట్), కల్లిస్ (186)లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను మూడు వికెట్ల నష్టానికి 422 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంతేకాకుండా 358 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా రికార్డు విజయాన్ని సాధించింది.
|