శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అతి స్వల్ప స్కోరుకు అవుట్ అయింది. దీంతో ఫాలోఆన్ ఆడుతోంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. గాలె మైదానంలో ఈనెల 18వ తేదీన ప్రారంభమైన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగులు భారీ స్కోరు చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకే ఆలౌట్ అయింది. వాస్ (4/28), వెలగెదరా (2/17) ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ కుప్పకూలారు. దీంతో.. 416 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఉదయానికి ఒక వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. లంక చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు మరో 340 పరుగులు దూరంలో వుంది.
|