మైదానంలో అంపైర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లు అప్పీలు చేయవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడు మాల్కం స్పీడ్ చెప్పారు. సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డ్ అంపైర్ స్టీవ్ బక్నర్ (వెస్టిండీస్), టీవీ అంపైర్ (ఆస్ట్రేలియా)లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో ఆసీస్ కష్టాల ఊబి నుంచి గట్టెక్కిన విషయం తెల్సిందే. ఈ దోషపూరిత అంపైరింగ్‌పై నలు వైపులా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఐసిసి ప్రెసిడెంట్ మాల్కం స్పీడ్ శుక్రవారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఇకపై దోషపూరిత అంపైరింగ్‌పై ఆటగాళ్లు అప్పీల్ సిస్టమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఎలైట్ ప్యానల్ సంఖ్యను 12 మందికి పెంచనున్నట్టు వివరించారు. అయితే ఈ పద్దతికి పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ నుంచి ట్రయల్ బేసిస్‌లో శ్రీకారం చుడుతామని స్పీడ్ వివరించారు.
|