ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బ్యాడ్ అంపైరింగ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న బీసీసీఐ
ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఫీల్డ్ అంపైర్ల "బ్యాడ్ అంపైరింగ్‌" పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్రంగా మండిపడింది. దీనిపై ఐసిసికి ఫిర్యాదు చేయాల్సిందిగా బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సూచించారు. సిడ్నీ మైదానంలో జరిగిన రెండో టెస్టులో బక్నర్ ఇచ్చిన వివాదాస్పద అంపైరింగ్ వల్ల ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు చేరుకున్నారు.

దీంతో ఆసీస్ జట్టు 16 వరుస విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ముఖ్యంగా సిడ్నీ విజయం అసీస్ జట్టుకు సాధించలేదని, ఫీల్డ్ అంపైర్లు ముఖ్యంగా.. స్టీవ్ బక్నర్ చేకూర్చి పెట్టిన విజయంగా క్రికెట్ నిపుణులు, పండితులు, అభిమానులు పేర్కొంటున్నారు. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. సిడ్నీ అంపైరింగ్‌పై ఫిర్యాదు చేయాల్సిందిగా జట్టు మేనేజ్‌మెంట్‌ను అధ్యక్షుడు శరద్ పవార్ ఆదేశించినట్టు చెప్పారు.

అంపైర్ తుది నిర్ణయం తీసుకునేముందు నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా ద్రావిడ్, గంగూలీని అవుట్‌‌గా ప్రకటించడం షాక్‌కు గురిచేసింది. ఇది సరైన అంపైరింగ్‌ కాదన్నారు. అలాగే.. బీసీసీఐ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రత్నాకర్ శెట్టి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ అనంతరం బ్యాడ్ అంపైరింగ్‌ అంశాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళతామన్నారు.

అంతేకాకుండా.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం తప్పుడు అంపైరింగ్‌పై నిరసన వ్యక్తం చేశాడు. ద్రావిడ్‌ను స్టీవ్ బక్నర్, గంగూలీని మార్క్ బెన్సన్‌లు అవుట్‌గా ప్రకటించి వివాదాస్పదమయ్యారు.
మరిన్ని
లక్ష్మణ్ కళాత్మక ఆటగాడు: స్టీవ్ వా
తప్పుడు అంపైరింగ్‌పై అప్పీలు: మాల్కం స్పీడ్
జహీర్ లేకున్నా భారత్ ఉత్తమ ప్రదర్శన: శ్రీనాధ్
జహీర్‌కు గాయం.. ఆటకు ఆరు వారాలు దూరం
చిత్తైన బంగ్లాదేశ్: కివీస్ సునాయాస విజయం
రెండో టెస్టుకు మార్పులు లేని ఆసీస్ జట్టు