ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సందిగ్ధంలో భారత-ఆసీస్ టెస్ట్ సిరీస్
అందరూ ఊహించినట్టుగానే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందిగ్ధంలో పడింది. అంపైర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ల వైఖరికి 'టీమ్ ఇండియా' నిరసన తెలియజేసింది. మూడో టెస్టు వేదికైన పెర్త్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. అయితే.. ప్రాక్టీసు మ్యాచ్ జరిగే కాన్‌బెర్రాకు మాత్రం వెళ్ళనుంది. దీంతో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శరద్ పవార్ తన నివాసంలో సోమవారం అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఆస్ట్రేలియాలో ఎదురవుతున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని భారత ఆటగాళ్లు బీసీసీఐను కోరారు.
అంతేకాకుండా జాతివివక్ష ఆరోపణలు ఎదుర్కొన్న స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై ఐసిసి మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం విధించిన విషయం తెల్సిందే. ఈ నిషేధ ఉత్తర్వు కాపీలను అందజేయాలని టీమ్ ఇండియా కోరుతోంది. అప్పటి వరకు సిడ్నీని వదిలి మూడో టెస్టు వేదికైన పెర్త్‌కు వెళ్ళబోమని తేల్చి చెప్పింది. ఇదిలావుండగా.. సిడ్నీలోని టీమ్ మేనేజ్‌మెంట్ బీసీసీఐ సమాధానం కోసం వేచివుంది.
మరిన్ని
భారత 'టర్బోనేటర్‌'పై మూడు టెస్టుల నిషేధం
బ్యాడ్ అంపైరింగ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న బీసీసీఐ
లక్ష్మణ్ కళాత్మక ఆటగాడు: స్టీవ్ వా
తప్పుడు అంపైరింగ్‌పై అప్పీలు: మాల్కం స్పీడ్
జహీర్ లేకున్నా భారత్ ఉత్తమ ప్రదర్శన: శ్రీనాధ్
జహీర్‌కు గాయం.. ఆటకు ఆరు వారాలు దూరం