ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హాగ్‌పై అభియోగాలు నమోదు: 14న విచారణ
ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రెఫరీ మైక్ ప్రొక్టర్ అభియోగాలు నమోదు చేశారు. ఐసిసి నియమావళిలోని నిబంధన మూడు కింద హాగ్‌పై వీటిని నమోదు చేశారు. సిడ్నీలో జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజున కుంబ్లే, ధోనీలను దూషించాడని హాగ్‌పై టీమ్ ఇండియా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ రెఫరీ మైక్ ప్రొక్టర్ మంగళవారం అభియోగాలు నమోదు చేసి, విచారణను మాత్రం వచ్చే 14వ తేదీకి వాయిదా వేశారు.

ఇందులో అభియోగాలు నిర్ధారణ అయితే హాగ్‌పై రెండు నుంచి నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు లేదా నాలుగు నుంచి ఎనిమిది వన్డేలు ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్‌పై ఆసీస్ క్రికెటర్ సైమండ్స్ జాతి వివక్ష ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీంతో.. భజ్జీపై మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసిసి విధించింది.
మరిన్ని
'టీమ్ ఇండియా'లో చేరనున్న కొత్త కోచ్ కీర్‌స్టన్
బోర్డు ఆదేశంతో కాన్‌బెర్రాకు "టీమ్ ఇండియా"
భారత క్రికెట్‌కు దక్కిన విజయం: రాజీవ్ శుక్లా
భజ్జీ భవితవ్యంపై 24 గంటల్లో నిర్ణయం: ఐసిసి
బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గిన ఐసీసీ: బక్నర్ ఔట్
నేడు బీసీసీఐ వర్కింగ్ కమిటీ కీలక భేటీ