అంతర్జాతీయ మూడు వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో సిరీస్ టైటిల్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. 144 పరుగులను కేవలం 34.2 ఓవర్లలో సాధించి బంగ్లాపై దక్షిణాఫ్రికా జయకేతనం ఎగురవేసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నాఫీస్ (25), నజీముద్దీన్ (20), ఫర్హాద్ రిజా (20 నాటౌట్)లు మినహా మరెవరూ నిలదొక్కుకోలేకపోవటంతో 42.5 ఓవర్లలో 143 పరుగులు చేసి బంగ్ల జట్టు ఆలౌటయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ గిబ్స్ రూపంలో గట్టిదెబ్బ తగిలింది.
కాని పీటర్సన్ (25)తో కెప్టెన్ స్మిత్ కదం తొక్కాడు. ఈ మధ్యలో నిలదొక్కుకుంటున్న సమయంలో బంగ్లా బౌలర్ హొస్సెయిన్ బౌలింగ్‌లో పీటర్సన్ ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన డుమిని (40 నాటౌట్)తో కలిసి స్మిత్ (68) దక్షిణాఫ్రికా జట్టును విజయపథంలో నడిపించాడు.
కాగా, ఈ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా వన్డేల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగిన విషయం తెలిసిందే.
|