దుబాయ్‌లో రెండు రోజుల పాటు సాగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వార్షిక సమావేశంలో కొన్ని కీలక నిర్ణాయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వివాదాస్పదమవుతున్న అంపైరింగ్ వ్యవస్థను సమీక్షించారు. ఇందులో రిఫరల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, అలాగే ఎల్బీడబ్య్లూలను నిర్థారించేందుకు 'హాక్ ఐ' టెక్నాలజీని అమలు చేయాలని భావిస్తున్నారు.
అంతేకాకుండా అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయం తప్పని భావిస్తే బ్యాట్స్‌మెన్ లేదా ఫీల్డింగ్ కెప్టెన్ రివ్యూ చేయాలని కోరవచ్చు. అయితే అంపైర్ నిర్ణయాన్ని ఒక మ్యాచ్‌లో మూడు సార్లు మాత్రమే రివ్యూ చేసేలా కోరవచ్చు. ప్రస్తుతం చేసిన ప్రతిపాదనలపై జూన్ 29వ తేదీన జరిగే ఐసిసి బోర్డు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.
|