ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబయిలో నిర్వహిస్తున్న మ్యాచ్‌ల వేదికను మార్చారు. నగరానికి దూరంగా ఉన్న నేరల్‌లోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 14, 16 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంలో నిర్వహిస్తారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నుంచి దీనికి సంబంధించిన ఫాక్స్ సందేశం తమకు వచ్చిందని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ అవినాష్ సాల్వే చెప్పారు.
క్రీడాకారులు ఉంటున్న హోటెల్ నుంచి డీవై పాటిల్ స్టేడియం 40 కి.మీ. దూరంలో ఉందని తెలిపారు. వేదిక మార్పుకు సంబంధించిన వివరాలు తమకు తెలియదన్నారు. డీవై పాటిల్ స్టేడియంలో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు జరిగాయి.
|