ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విండీస్‌కు ఆలస్యంగా వెళ్లనున్న క్లార్క్
ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వెస్టిండీస్ పర్యటనకు ఆలస్యంగా వెళ్లనున్నాడు. వ్యక్తిగత కారణాలను దృష్టిలో ఉంచుకొని క్లార్క్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా మరికొద్ది రోజుల పాటు సెలవు మంజూరు చేసింది. అందువల్ల క్లార్క్ కరేబియన్ దీవుల పర్యటనకు ఆలస్యంగా వెళతాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన సభ్యులు శనివారం విండీస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

అయితే.. మైఖేల్ క్లార్క్ త్వరలోనే జట్టులో చేరుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జట్టులో క్లార్క్ ఎపుడు చేరతాడనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. క్లార్కే వచ్చేంత వరకు మైఖేల్ హుస్సే వైస్ కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహించేందుకు అంగీకరించాడని సీఏ పేర్కొంది. వెస్టిండీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు ఈనెలలోనే ప్రారంభమవుతాయి.
మరిన్ని
ఎంపీల 'ఫిట్‌నెస్'‌కు బీసీసీఐ చేయూత
ఐపీఎల్ : చెన్నై సూపర్ కింగ్స్ విజయం
చెన్నై సూపర్ కింగ్స్ విజయలక్ష్యం 188 పరుగులు
వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు
ఐపీఎల్ : ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్ కింగ్స్
క్రికెట్ కమిటి ఛైర్మన్ పదవికి సన్నీ రాజీనామా