పంజాబ్ కింగ్ యువరాజ్ సింగ్‌కు అదృష్ట దేవత తలుపుతట్టినట్టుంది. అసలే కొంటె కుర్రోడు. ఆపై వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడా? ఈ పంజాబీ బుల్లోడు ఐపీఎల్ టోర్నీలో చెలరేగి పోతున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఒకటైన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు కెప్టెన్‌గా యూవీ.. మైదానంలో అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
దీంతో ఆ జట్టు యజమానురాలు, బాలీవుడ్ హీరోయిన్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాకు ఆనందం పట్టలేక పోతోంది. తన జట్టు ప్రారంభ మ్యాచ్‌లలో ఓడినప్పటికీ ఆ తర్వాత విజృంభించింది. దీంతో ప్రీతి జింటా తన జట్టు కెప్టెన్ యువరాజ్‌ను ముద్దులతో ముంచెత్తుతోంది.
అంతేకాదండీ.. మ్యాచ్ అనంతరం మైదానంలోకి పరుగులు తీస్తూ యూవీని గట్టిగా హత్తుకుని మరీ అభినందిస్తోంది. అయితే జట్టులోని ఆటగాళ్ళు మాత్రం కరచాలనంతో సంతోషపడాల్సి వస్తోంది. ఏమైనా.. యూవీనా మజాకా..!. గతంలో మందిరాబేడీ, దీపికా పడుకొనే వంటి ముద్దుగుమ్మలను తనవైపు తిప్పుకున్న అనుభవం యూవీకి ఉంది కదా.
|