ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముక్కోణపు సిరీస్‌: ఆటగాళ్ళ ఎంపికలో పిసిబి  Search similar articles
వచ్చే నెలలో జరుగనున్న ముక్కోణపు సిరీస్‌‌లో ఆడించే జట్టు ఎంపిక కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా 20 మంది సభ్యులతో కూడిన ఒక జాబితాను సెలక్షన్ కమిటీ తయారు చేసి, ఈనెల 20వ తేదీలోగా క్రికెట్ బోర్డుకు సమర్పించనుంది. ఇందులో నుంచి 16 మంది ఆటగాళ్ళతో తుది జట్టును ఖరారు చేస్తారు. జూన్ నెల ఎనిమిదో తేదీ నుంచి భారత్-బంగ్లాదేశ్-పాకిస్థాన్ దేశాల మధ్య ముక్కోణపు సిరీస్ జరుగనుంది.

బంగ్లా దేశ రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మ్యాచ్‌లన్ని జరుగుతాయి. దీనిపై పిసిబి ముఖ్య కార్యనిర్వహణాధికారి షఫ్కాత్ నజ్మీ మాట్లాడుతూ.. జట్టుకు అందుబాటులో ఉండే అనేక మంది ఆటగాళ్లు మల్టీ మిలియన్ డాలర్లు కుమ్మరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నిమగ్నమైవున్నారని, అందువల్ల జట్టు కోసం ఎంపిక చేసే ఆటగాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
మరిన్ని
నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ X పంజాబ్ కింగ్స్ పోరు
నైట్ రైడర్స్ జట్టులో చేరనున్న హోడ్జ్
సెమీస్ బెర్త్ ‌కోసం సచిన్-గంగూలీ పోటీ
గంభీర్, మిశ్రా జోరుః ఛార్జర్స్‌‌కు మళ్లీ ఓటమి
ఐపీఎల్ : ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాటింగ్
పేలుళ్లతో బెదిరిపోతున్న విదేశీ క్రికెటర్లు