ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్‌ బీచ్ పార్టీపై బీసీసీఐ ఆరా  Search similar articles
ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు జరిగిన బీచ్‌ పార్టీపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆరా తీస్తోంది. ఆసియా కప్ టోర్నీ పాకిస్థాన్ గడ్డపై జరిగిన విషయం తెల్సిందే. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌లోని ప్రఖ్యాత ఫ్రెంచ్ బీచ్‌లో భారత క్రికెటర్లు పార్టీని జరుపుకున్నారు.

ఇందులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మలు స్థానిక స్నేహితులతో కలసి పాల్గొన్నారు. పార్టీ ముగిసిన తర్వాత తెల్లవారు జామున బసచేసిన హోటల్‌కు వచ్చారు. ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగారు.

పార్టీలో పాల్గొనడం వల్ల పూర్తిగా అలసి పోయినట్టు మైదానంలోకి దిగిన ఈ ఆటగాళ్లను చూస్తేనే తెలిసిపోయింది. అందువల్లే శ్రీలంక బౌలర్ మెండీస్‌‍ విసిరే బంతులపై ఏకాగ్రత పెట్టలేక పోయారని వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ వంద పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెల్సిందే. ఈ బీచ్ పార్టీపై బీసీసీఐ పూర్తి నివేదికను కోరింది.
మరిన్ని
పాక్ ప్రాబబుల్స్‌లో అక్తర్ - అసిఫ్‌లకు చోటు
ఆసీస్ ప్రాబబుల్స్‌లో సైమండ్స్‌కు చోటు
వన్డేలపై తగ్గుతున్న మోజు: ఐసిసి ఆందోళన
ఐసిసిపై చాపెల్ ధ్వజం
ప్రాబబుల్స్‌లో గంగూలీ-ద్రావిడ్‌లకు రిక్తహస్తం
ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణపై నీలి నీడలు..!