ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నష్టపరిహార వార్తలను తోసిపుచ్చిన పిసిబి  Search similar articles
ఛాంపియన్ ట్రోఫీ వేదికను మార్చిన పక్షంలో నష్టపరిహారం డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. దీనిపై పిసిబి ముఖ్య కార్యనిర్వహణాధికారి షఫ్కాత్ నజ్మీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టోర్నమెంట్‌ వేదికను శ్రీలంక లేదా దక్షిణాఫ్రికాలకు మార్చిన పక్షంలో ఏర్పడే నష్టం గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదన్నారు. అలాగే దీనిపై ఐసిసి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు.

అందువల్ల ఛాంపియన్ ట్రోఫీని తామే నిర్వహిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్, కరాచీలలో బాంబు పేలుళ్లు దురదృష్టవశాత్తు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ఐసిసి తమతో ఎలాంటి చర్చలు జరుపలేదన్నారు. అలాగే తమ వైఖరిలో కూడా మార్పులేదని నజ్మీ స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్ టోర్నమెంట్‌ వేదికను పాక్‌ నుంచి మార్చిన పక్షంలో మూడు మిలియన్ల్ డాలర్ల మేరకు నష్టపరిహారం చెల్లించాలని ఐసిసిని పిసిబి డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

ఇప్పటికి తాము టోర్నీ నిర్వహణపై ఆశలు పెట్టుకున్నట్టు చెప్పారు. ఇక్కడి భద్రతా ఏర్పాట్లను ఐసిసి నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఈ టోర్నీలో పాల్గొనే వివిధ జట్లకు గట్టి భద్రతను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ఐసిసి భద్రతా బృందానికి బోర్డు అన్ని విధాలా సహకరిస్తున్నట్టు చెప్పారు. అలాగే కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాల్లో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఈ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
మరిన్ని
రూ.12 కోట్ల నష్టపరిహారం చెల్లించండి: పిసిబి
పాక్‌ బీచ్ పార్టీపై బీసీసీఐ ఆరా
పాక్ ప్రాబబుల్స్‌లో అక్తర్ - అసిఫ్‌లకు చోటు
ఆసీస్ ప్రాబబుల్స్‌లో సైమండ్స్‌కు చోటు
వన్డేలపై తగ్గుతున్న మోజు: ఐసిసి ఆందోళన
ఐసిసిపై చాపెల్ ధ్వజం