అంపైర్ల పరస్పర మార్పిడిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు ఒక అహగాహనకు వచ్చాయి. ఈ అహగాహన మేరకు ఇరు దేశాలకు చెందిన అంపైర్లు ఆయా దేశాలకు వెళ్లి విధులు నిర్వహిస్తారు.
దీనిపై బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 2008-09 క్రికెట్ సీజన్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు అంపైర్లు దక్షిణాఫ్రికాకు వెళ్లి దేశవాళీ క్రికెట్‌లో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు అంపైర్లు భారత్‌కు వచ్చి దులీఫ్ ట్రోఫీ దేశవాళీ క్రికెట్‌లో అంపైరింగ్ బాధ్యతలను నిర్వహిస్తారని నిరంజన్ షా తన ప్రకటనలో పేర్కొన్నారు. అంపైర్స్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్ కింద అంపైర్లు ఇరు దేశాల్లో నిధులు నిర్వహిస్తారని తెలిపారు.
|