శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీథరన్‌కు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత క్రీడా పురస్కారంతో సత్కరించింది. శ్రీలంక దేశాధ్యక్షుడు మహీంద రాజపక్సే ఈ అవార్డును మురళీకి ప్రదానం చేశారు. ఈకార్యక్రమానికి క్రీడాకారులతో పాటుగా ఇతరులు వచ్చారు. ముత్తయ్య మురళీథరన్ వయస్సు 36 ఏళ్లు. 1992లో కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా మురళీ టెస్టు కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకూ 120 మ్యాచ్‌లాడి 21.95 శాతం సగటుతో 735 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 వికెట్ల ఫీట్‌ను 20 మ్యాచ్‌లలో పడగొట్టాడు. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన వ్యక్తి మురళీథరన్.
కొలంబో వేదికగా 1993లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా మురళీ వన్డే కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ 310 మ్యాచ్‌లాడి 22.85 శాతం సగటుతో 475 వికెట్లు పడగొట్టాడు. వయుసు మీద పడుతున్నా అద్భుతంగా ఆడుతూ శ్రీలంక స్పిన్ విభాగానికి దిక్సూచిలా మురళీ వ్యవహరిస్తున్నారు.
|