ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియం ఆగస్టు నాటికి పూర్తికాగలదని ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బ్రిజ్‌భూషణ్ అగర్వాల్ చెప్పారు. ఈ స్టేడియం నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ చేపట్టిందన్నారు.
రాజధాని రాయపూర్‌కు 20 కి.మీ. దూరంలోని పర్సాడా వద్ద ఈ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేడియంలో పెవిలియన్, ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డు, మీడియా సెంటర్, కామెంటరీ బాక్స్, ప్రేక్షకుల కోసం ఆరు పెద్ద స్టాండుల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు.
రాయపూర్ నుంచి స్టేడియం ఉన్న ప్రాంతానికి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టామన్నారు. ఈ స్టేడియం సామర్ధ్యం 60వేలని వివరించారు. దేశంలోని ప్రముఖ రాష్ట్ర రాజధానుల్లో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయని తెలిపారు. అయితే తమకు సమీపంలో జంషెడ్‌పూర్, కటక్, హైదరాబాద్, నాగపూర్, ఇండోర్‌లలో మాత్రమే ఉన్నాయని అగర్వాల్ వెల్లడించారు.
|