అస్త్రేలియా బ్యాటింగ్ వీరుడు మాథ్యూ హెడెన్ క్రికెట్‌కు స్వస్తి పలకనున్నాడు. తన అత్యద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేకెత్తించిన మాథ్యూ హెడెన్ భారత ఉపఖండంలో జరిగే 2011 ప్రపంచకప్ పోటీలకు ముందే ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ హెడెన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.
క్రికెట్‌లో ఆస్ట్రేలియా యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వైదొలగుతున్నానని 36ఏళ్ళ హెడెన్ పేర్కొన్నాడు. తాను తప్పుకున్న తర్వాత అస్ట్రేలియా క్రికెట్‌లో సంధికాలం ఏర్పడుతుందని హెడన్ వెల్లడించాడు. ఏడాది కాలం పాటు గాయాలతో సతమతమవుతుంటే, టెస్ట్ మ్యాచ్‌పై దృష్టి సారించాలని డిమాండ్ చేసినా, వన్డేల నుంచి తప్పుకోమన్నా తాను ఏమాత్రం చలించలేదని హెడెన్ వెల్లడించాడు.
చివరకు గాయాలతో విసుగుచెంది క్రికెట్‌కు స్వస్తి చెప్పాలని హెడెన్ నిర్ణయించుకున్నాడు. క్రికెట్‌లో తగిలిన గాయాల వల్ల కరీబియన్ టూర్‌కు వెళ్ళలేకపోయాడు. కాగా సెప్టెంబర్‌లో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్ ట్రోఫీకి హాజరయ్యేది సందేహమేనని హెడెన్ పేర్కొన్నాడు.
|