క్రికెట్ ప్రేక్షకులను భారీ సంఖ్యలో ఆకర్షించేందుకు వీలుగా టెస్టులను డే అండ్ నైట్ మ్యాచ్‌లుగా నిర్వహించేందుకు తాము సిద్ధమని మెల్‌బోర్న్ టెలెస్ట్రా డోమ్ తెలిపింది. ట్వంటీ20 పోటీల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా టెస్టు, వన్డే మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రానురానూ తగ్గుతున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాలో ప్రధాన నగరాల్లో ఒకటి మెల్‌బోర్న్. స్థానిక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఎప్పటినుంచో టెస్టు, వన్డే మ్యాచ్‌లను నిరంతరాయంగా ఆతిథ్యమిస్తూ వస్తోంది. టెలెస్ట్రా డోమ్‌లో ఎటువంటి ప్రతికూల వాతవరణ పరిస్థితులు ఏర్పడినా నిరవధికంగా మ్యాచ్ నిర్వహించే సామర్ధ్యం టెలెస్ట్రా డోమ్‌కు ఉంది.
క్రికెట్ ఆస్ట్రేలియా నిపుణులను టెలెస్ట్రా డోమ్‌కు పంపించి అక్కడి పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలని కోరింది. మెల్‌బోర్న్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించే దానిపై క్రికెట్ విక్టోరియా, ఎంసీజీల మధ్య వివాదం నెలకొంది. దీనిని పరిష్కరించే దిశగా క్రికెట్ ఆస్ట్రేలియా కృషి చేస్తుంది.
|