ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ద్వితీయ శ్రేణి జట్టు వెళ్ళొచ్చు: ఏసీఏ  Search similar articles
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తీసుకున్న నిర్ణయం పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. ఛాంపియన్ ట్రోఫీని పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తే టోర్నీలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్ళతో కూడిన జట్టు పాల్గొనవచ్చని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) చీఫ్ పాల్ మార్ష్ సూచన ప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఛాంపియన్ ట్రోఫీ ఆసీస్‌లోనే కొనసాగిన పక్షంలో, ప్రపంచంలోని అనేకమంది అత్యుత్తమ ఆటగాళ్లు టోర్నీకి దూరమవుతారని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా తమ అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనే ఎనిమిది క్రికెట్ దేశాల బోర్డులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన ఐసిసి పాలక మండలి టోర్నీని పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని తీర్మానించిన విషయం తెల్సిందే. ఐసిసి నిర్ణయానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు తీవ్ర వ్యతిరేకత తెలిపాయి. దీనిపై మార్ష్ మాట్లాడుతూ ఐసిసి నిర్ణయం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. భద్రతా చర్యలను ఏమాత్రం పరిగణంలోకి తీసుకోలేదని ఆరోపించారు.
మరిన్ని
ఛాంపియన్ ట్రోఫీ: బాయ్‌కట్‌కు ఆటగాళ్ల పిలుపు
ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక పాకిస్థాన్
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఆతిధ్యం
అంఫైర్‌ల నిర్ణయానికి ఢోకా లేదు : ఐసీసీ
ఆటగాళ్లకు సైనిక శిక్షణ : పాక్ క్రికెట్ బోర్డ్
క్రికెట్‌కు స్వస్తి పలకనున్న హెడెన్