ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తొలి టెస్ట్: దిల్షాన్ సెంచరీ, లంక 582/6  Search similar articles
సొంత గడ్డపై జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక పరుగుల వరద పారిస్తోంది. భారత బౌలర్లు పలు రకాల ప్రయోగాలు చేసినప్పటికీ లంక బ్యాట్స్‌మెన్స్‌ను అవుట్ చేయలేక నానా తంటాలు పడుతున్నారు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఈనెల 23వ తేదీన కొలంబో క్రికెట్ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభమైన విషయం తెల్సిందే. తొలుత టాస్ గెలిచిన లంక కెప్టెన్ జయవర్ధనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచ్‌ సక్రమంగా సాగలేదు.

రెండో రోజున మాత్రం శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ తమ బ్యాట్లకు పని చెప్పారు. ఓపెనర్ వర్నపురా (115), జయవర్ధనే (136), సమరవీర (127)లు సెంచరీలతో కదం తొక్కారు. మూడో రోజైన శుక్రవారం దిల్షాన్ (114 నాటౌట్) కూడా సెంచరీతో కదం తొక్కాడు. దీంతో లంక జట్టు ఆరు వికెట్ల నష్టానికి 582 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం దిల్షాన్‌, చమిందా వాస్‌లు క్రీజ్‌లో ఉన్నారు.
మరిన్ని
ద్వితీయ శ్రేణి జట్టు వెళ్ళొచ్చు: ఏసీఏ
ఛాంపియన్ ట్రోఫీ: బాయ్‌కట్‌కు ఆటగాళ్ల పిలుపు
ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక పాకిస్థాన్
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఆతిధ్యం
అంఫైర్‌ల నిర్ణయానికి ఢోకా లేదు : ఐసీసీ
ఆటగాళ్లకు సైనిక శిక్షణ : పాక్ క్రికెట్ బోర్డ్