ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > మహిళల క్రికెట్ : ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళల క్రికెట్ : ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
టాంటన్‌లో సోమవారం జరుగిన వన్డే మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓటమి చెందింది. భారత్‌పై విశేషంగా రాణించిన ఇంగ్లాండ్ మహిళా జట్టు పది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణయించిన 103 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో భారత్‌పై వరసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడం ద్వారా ఇంగ్లాండ్ ఈ టోర్నీలో 2-0 తేడాతో పై చేయి సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45.1 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మిథాలీరాజ్ (53) మినహా తక్కిన బ్యాట్స్ ఉమెన్ అందరూ స్వల్ప స్కోరుకే వెనుతిరిగారు. దీంతో భారత్ 103 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 24.3 ఓవర్లలో విజయలక్ష్యాన్ని అందుకుంది. టేలర్ 77 బంతుల్లో ఓ సిక్స్, ఏడు బౌండరీలతో సహా 75 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయాన్ని సునాయసం చేసింది. టేలర్‌కు తోడు అట్కిన్స్ 70 బంతుల్లో 24 పరుగులు సాధించడంతో ఇంగ్లాండ్ వికెట్లేవీ నష్టపోకుండానే విజయం సాధించింది.

మరిన్ని
అఫ్రిది వ్యాఖ్యలు సరికావు : లక్ష్మణ్
కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆధిక్యం
మహిళల క్రికెట్‌: తొలి వన్డేలో భారత్‌ ఓటమి
ఆండ్రూ సైమండ్స్‌పై చర్య సబబే: స్టీవ్‌ వా
భారత్‌తో ఒకే ప్రాక్టీస్ మ్యాచ్ : జాన్సన్ అసంతృప్తి
శ్రీలంకతో సిరీస్ నెగ్గడం సంతోషం : ధోనీ