త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో ఉంచడం కోసమే సచిన్ టెండూల్కర్‌ను ఇరానీ ట్రోఫీకి దూరం చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా పేర్కొన్నారు. సచిన్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నాడని అయితే మరోవారం పాటు అతనికి అదనపు విశ్రాంతి అవసరం అన్న ఫిజియో సలహా మేరకే ఇరానీ ట్రోఫీలో సచిన్ ఆడడం లేదని షా తెలిపారు.
సచిన్‌కు గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదన్న వార్తల నేపథ్యంలో నిరంజన్‌షా పై విధంగా వివరణ ఇచ్చారు. ఈ విషయమై షా మాట్లాడుతూ సచిన్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నాడని అయితే ముఖ్యమైన ఆస్ట్రేలియా సిరీస్ ముందు మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశాలు ఉండకూడదనే తామీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆసిస్ సిరీస్ ముందు ఇరానీ ట్రోఫీ ఆడేందుకు సచిన్ సిద్ధమయ్యాడని అందుకే ఈ విషయమై సచిన్ స్వయంగా ప్రకటన చేశాడని కానీ తామే సచిన్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా సిరీస్‌ను దృష్టిలో ఉంచుకునే సచిన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
|