ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ఐసీఎల్‌కు కొత్త కళ : ఛీర్ లీడర్స్ క్వీన్‌గా రాఖీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐసీఎల్‌కు కొత్త కళ : ఛీర్ లీడర్స్ క్వీన్‌గా రాఖీ
WD PhotoWD
బీసీసీఐ క్రికెట్ రెబల్ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) తన ట్వంటీ20 టోర్నీలకు కొత్త కళ తేనుంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్‌ను ఛీర్ లీడర్స్ క్వీన్‌గా ఎన్నుకోవడం ద్వారా టోర్నీ వైపు అభిమానులను ఆకర్షించడానికి ఐసీఎల్ నిశ్చయింది.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయమై రాఖీ సావంత్ స్వయంగా మాట్లాడుతూ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీఎల్ రెండో సీజన్ సందర్భగా తాను ఛీర్ లీడర్స్ క్వీన్‌గా ప్రేక్షకులను అలరించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ నుంచే ఛీర్ లీడర్స్ క్వీన్‌‍గా ప్రేక్షకులకు తాను దర్శనమివ్వనున్నట్టు రాఖీ పేర్కొన్నారు.

అంతేకాకుండా ఛీర్ లీడింగ్ అంటే తమాషా వ్యవహారం కాదని అది కూడా ఓ క్రీడలాంటిదేనని అన్నారు. అందుకే తమ ఛీర్‌లీడింగ్ కార్యక్రమాన్ని ఎవరూ నిషేధించలేరని కారణం తమది అసభ్యమైన నృత్యం కాబోదని ఆమె పేర్కొన్నారు. ఐసీఎల్ మ్యాచ్‌లను చూడాల్సిందిగా తాను ఐసీఎల్ తరపున లలిత్ మోడీ, శరద్‌పవార్‌లను ఆహ్వానిస్తున్నానని కూడా రాఖీ అన్నారు.
మరిన్ని
సీనియర్లూ మీ రిటైర్మెంట్ ఎప్పుడు : బీసీసీఐ
పెరిగిన బీసీసీఐ వార్షిక ఆదాయం : వెయ్యి కోట్లకు చేరిక
భారత్‌తో సిరీస్ పెద్ద ఛాలెంజ్ : హస్సీ
భారత్- ఆస్ట్రేలియా సిరీస్‌కు నాణ్యమైన పిచ్‌లు
అక్తర్‌కు మరో ఛాన్స్ : ట్వంటీ20లో చోటు
ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ : కెప్టెన్‌గా యువరాజ్