ఐపీఎల్ టోర్నీలో తలపడుతోన్న హైదరాబాద్ జట్టు డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్‌గా కొనసాగుతోన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు ఉద్వాసన పలికింది. లక్ష్మణ్ స్థానంలో జట్టు వైస్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
గత సీజన్‌లో ఐపీఎల్ టోర్నీలో తలపడిన ఎనిమిది జట్లలో డెక్కన్ ఛార్జర్స్ జట్టు చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యం ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం కొత్త సీఈఓను నియమించిన యాజమాన్యం ప్రస్తుతం కెప్టెన్సీ మార్పుకు సిద్ధమైంది.
ఐపీఎల్ టోర్నీలో భాగమైన ట్వంటీ20 తరహా క్రికెట్‌కు లక్ష్మణ్ పనికిరాడని ఆ తరహా ఆటకు సరిపోయే నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని గత కొంతకాలంగా గుసగసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడైన అఫ్రిది సైతం లక్ష్మణ్ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు.
ఇలా అందరి దృష్టిలో వివాదమైన లక్ష్మణ్ కెప్టెన్సీపై తాజాగా జట్టు యాజమాన్యం సైతం నమ్మకం కోల్పోవడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయక పోవడం గమనార్హం. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. | |
|