ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > రికార్డులు నా లక్ష్యం కాదు : సచిన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రికార్డులు నా లక్ష్యం కాదు : సచిన్
రికార్డులు తన లక్ష్యం కాదని ప్రస్తుతం తాను ఆటపై మాత్రమే దృష్టి కేంద్రీకరించానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డుకు కేవంల 76 పరుగుల దూరంలో ఉన్న సచిన్ పై విధంగా స్పందించాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ప్రస్తుతం బెంగుళూరులో జరుగుతోన్న శిక్షణా శిభిరంలో సచిన్ పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడుతూ రికార్డుల కోసం తాను ఆడడం లేదని అన్నాడు. తాను ఆట మీద మాత్రమే దృష్టి పెడుతానని ఆ సందర్భంలో రికార్డులు వాటంతట అవే వస్తాయని సచిన్ పేర్కొన్నాడు.

వెస్టీండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా టెస్ట్ క్రికెట్‌లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమించడానికి సచిన్‌కు కేవలం 76 పరుగులు మాత్రమే అవసరం అన్న విషయం తెలిసిందే. దీంతో రానున్న ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా సచిన్ ఈ రికార్డు అధిగమిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అసలు ఈ రికార్డును సచిన్ కొద్ది రోజుల క్రితం ముగిసిన శ్రీలంక సిరీస్‌లోనే పూర్తి చేయాల్సింది. కానీ ఈ సిరీస్‌లో సచిన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇంగ్లాండ్‌తో సిరీస్ : బెంగుళూర్‌లో నాలుగో వన్డే
సెలక్టర్ల వేతనం మరింత పెంచాలి : వెంగ్ సర్కార్
ఆసీస్ సిరీస్‌లో ఎలాంటి మార్పూ లేదు : బీసీసీఐ
భారత్‌తో టెస్ట్ సిరీస్ : ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
వైభవం కోసం కోల్‌కతా రంజీ జట్టు ప్రయత్నాలు
పాంటింగ్ టీం ఇండియా పనిపడతాడు : ఛాపెల్