బీసీసీఐ రెబల్ క్రికెట్ లీగ్ అయిన ఐసీఎల్ రెండో సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది జట్లు పాల్గొంటోన్న ఈ టోర్నీ ఈ నెల 16వరకు జరగనుంది. బీసీసీఐ రెబల్‌గా గత ఏడాది ప్రారంభమైన ఐసీఎల్ ప్రస్తుతం రెండో సీజన్‌లోకి అడుగుపెట్టింది.
ఈ టోర్నీ సందర్భంగా నిర్హహించనున్న మ్యాచ్‌లు హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా చండీఘర్, గుర్గావ్, అహ్మదాబాద్, పంచకులలో కూడా జరగనుంది. గత ఏడాది ఓ మోస్తరు ప్రజాదరణ పొందిన ఐసీఎల్ టోర్నీ ఈసారి ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించే దిశగా నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా గత ఏడాది ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొన్న ఈ టోర్నీలో ఈసారి బంగ్లా క్రికెటర్లతో ఏర్పాటు చేసిన ఢాకా వారియర్స్ అనే కొత్త జట్టు కూడా వచ్చి చేరింది. ఇది మాత్రమే కాకుండా మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కల్గించేందుకు ఏర్పాటు చేసిన ఛీర్ గాళ్స్ టీంలోకి బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్‌ను కచేర్చింది.
ఇన్ని హంగులతో ప్రారంభం కానున్న ఈ ఐసీఎల్ టోర్నీ రెండో సీజన్‌లో ఏ మేరకు క్రికెట్ అభిమానుల మన్ననలను చూరగొంటుందో వేచి చూడాలి. |