ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ప్రపంచ రికార్డుకు 15 పరుగుల దూరంలో సచిన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచ రికార్డుకు 15 పరుగుల దూరంలో సచిన్
వెస్డీండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా ప్రపంచ రికార్డును అధిగమించేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కేవలం 15 పరుగుల దూరంలో నిలిచాడు. బెంగుళూరులో సోమవారం ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్‌లోనే సచిన్ ఈ ఫీట్ సాధిస్తాడని భావించిన అభిమానులు మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బెంగుళూరులో ఆస్ట్రేలియా, భారత్ మధ్య సోమవారం తొలి టెస్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ 13 పరుగులకు ఔట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ 49 పరుగుల వద్ద ఔట్ అయిన విషయం తెలిసిందే. దీంతో బ్రియాన్ లారా పేరున ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును అధిగమించేందుకు సచిన్ మరో 15 పరుగుల దూరంలో నిలిచాడు.

గత శ్రీలంక టూర్‌లోనే సచిన్ ప్రపంచ రికార్డును సాధిస్తాడని అభిమానులు ఎదురుచూశారు. అయితే ఆ సిరీస్‌లో సచిన్ విఫలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మరో మూడు టెస్టులు మిగిలిన కారణంగా రెండో టెస్ట్ సందర్భంగా సచిన్ ప్రపంచ రికార్డ్ సాధించే అవకాశముంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సచిన్ రికార్డును పాంటింగ్ అధిగమిస్తాడు : ఛాపెల్
బీసీసీఐతో శ్రీలంక బోర్డు ఒప్పందం సరికాదు : ఐసీసీ
యువీ, కైఫ్, బద్రీనాధ్ కెప్టెన్లుగా ఛాలెంజర్ ట్రోఫీ
హైదరాబాద్ వేదికగా నేటి నుంచి ఐసీఎల్ టోర్నీ
సీనియర్లకు గౌరవప్రదమైన వీడ్కోలు : పిళ్లై
గంగూలీ వ్యాఖ్యలు సరికావు : గవాస్కర్