ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ఎక్స్, వై, జడ్ సలహాలు అవసరం లేదు : సచిన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎక్స్, వై, జడ్ సలహాలు అవసరం లేదు : సచిన్
తన రిటైర్మెంట్ గురించి ఎక్స్, వై, జడ్ సలహాలేవీ తనకు అవసరం లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. మొహాలీలో శుక్రావారం ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తనపై వస్తోన్న విమర్శలకు సూటిగా సమాధానమిచ్చాడు.

మొహాలీలో లారా ప్రపంచ రికార్డును అధిగమించి టెస్టుల్లో 12000 పరుగుల మైలురాయి దాటిన సందర్భంగా మ్యాచ్ అనంతరం సచిన్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. తన 19ఏళ్ల కెరీర్‌లో మొహాలీలో సాధించిన రికార్డే అతి పెద్ద రికార్డ్ అని సచిన్ పేర్కొన్నాడు. తానెపుడూ రికార్డులు గురించి ఆలోచించలేదని ఆట మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించానని సచిన్ తెలిపాడు.

టెస్టుల్లో ప్రపంచ రికార్డు గురించి సచిన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం వరకు తాను ఆ రికార్డు గురించి ఆలోచించలేదని అయితే మ్యాచ్‌కు ముందువరకు అందరూ ఆ రికార్డు గురించే మాట్లాడేవారని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తనకు క్రికెట్ అంటే ఇష్టమని అందుకే ఆడాలనుకున్నంతకాలం క్రికెట్ ఆడుతూనే ఉంటానని సచిన్ తెలిపాడు.

తన రిటైర్మెంట్ గురించి తాను నిర్ణయం తీసుకోగలని ఈ విషయంలో ఎక్స్, వై, జడ్ సలహాలేవీ తనకు అవసరం లేదని సచిన్ స్పష్టం చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సచిన్‌ ప్రపంచ రికార్డ్ : రాష్ట్రపతి అభినందనలు
ఐసీసీ ర్యాంకింగ్స్ : బౌలింగ్‌ అగ్రస్థానంలో జులన్
మురిసిన మొహాలీ : టెస్టుల్లో సచిన్ ప్రపంచ రికార్డు
మొహాలీలో ఆ ముచ్చట తీరేనా... ?
ఐసీఎల్‌తో బీసీసీఐ చర్చలు విఫలం
రెండో టెస్టుకు మొహలీ వేదిక సిద్ధం