టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ల వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. ఆసీస్-ఇండియా మూడో టెస్టు సందర్భంగా గౌతం గంభీర్-షేన్ వాట్సన్ వ్యవహారంలో ఐసీసీ ఇద్దరికీ శిక్ష విధించింది. ఇందులో భాగంగా... వాట్సన్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించగా, గంభీర్‌పై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మొదటి రోజున గౌతం గంభీర్-షేన్ వాట్సన్‌ల మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా తొలి రన్ కోసం పరుగు తీస్తున్న గంభీర్‌ను వాట్సన్ చేతిలో అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అందుకు ప్రతిగా గంభీర్ రెండవ రన్‌లో పరిగెత్తే సమయంలో వాట్సన్ ఛాతికి ఎడమ మోచేయిని తాకిస్తూ వెళ్లాడు. దీంతో చెలరేగిన వివాదంపై విచారణ చేపట్టిన ఐసీసీ ఇరువురికి పైవిధంగా శిక్షలు విధించింది. |