ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొడుతున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్ చివరిదైన నాగపూర్ టెస్ట్‌లో ఆడడం అనుమానంగా మారింది. మూడో టెస్ట్ సందర్భంగా మ్యాచ్ రిఫరీ గంభీర్‌కు విధించిన టెస్ట్ నిషేధాన్ని అమలు చేయాలని ఐసీసీ అప్పీల్స్ కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఈ విషయమై బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ నాలుగో టెస్ట్‌లో గంభీర్ ఆడకుండా ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై తాము అభ్యంతరం తెలిపినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో నాలుగో టెస్ట్‌లో గంభీర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఎం. విజయ్‌కు అవకాశం కల్పించినట్టు వారు తెలిపారు.
మూడో టెస్ట్‌లో వాట్సన్‌ను ఉద్ధేశ్యపూర్వకంగా చేతితో నెట్టివేసినందుకుగాను గంభీర్‌పై ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంపై గంభీర్ పునర్విచారణ కోరగా అతని కోరికను ఐసీసీ అప్పీల్స్ కమిషన్ మన్నించలేదు. |