ఆటతీరులో తనలో ఏం మార్పు రాలేదని మార్పంటూ వస్తే అది మీడియాలోనేనని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేర్కొన్నాడు. తాను ఎప్పుడు కూడా సహజమైన ఆటనే ఆడుతున్నానని ఇందులో ఎలాంటి సందేహం లేదని సచిన్ వ్యాఖ్యానించాడు.
నాగ్‌పూర్ టెస్ట్‌లో తొలిరోజు ఆట అనంతరం సచిన్ మాట్లాడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే త్వరత్వరగా నాలుగు బౌండరీలు బాధేస్తే అది సహజమైన ఆటతీరు అనిపించుకోదని సచిన్ అన్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందిగానీ మీడియా చెప్పినట్టు కాదని సచిన్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాపై గతకొంతకాలంగా మంచి ఇన్నింగ్స్ ఆడినా సెంచరీ మాత్రం నమోదు కాలేదని ప్రస్తుతం ఆలోటు తీరిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. అయితే సెంచరీ సాధించినంత మాత్రాన తానేమీ సంతోషపడిపోనని ఎందుకంటే రికార్డుల కోసం తానెపుడూ ఆడలేదని సచిన్ పేర్కొన్నాడు.
తాను చేసిన సెంచరీలు జట్టు విజయానికి ఉపయోగపడితేనే తనకు నిజమైన సంతోషం కల్గుతుందని ఈ సందర్భంగా సచిన్ అన్నాడు. |