ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌ను బెంబేలెత్తించి, ముంబయి జట్టు ట్రోఫీ అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్పీడ్‌స్టర్ జహీర్‌ఖాన్ కోసం... ముంబయి ఇండియన్స్ రాబిన్ ఊతప్పను త్యాగం చేసింది.గతంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు జహీర్‌ఖాన్, ముంబయి ఇండియన్స్‌కు కర్ణాటక బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్పలు నాయకత్వం వహించారు. అయితే... రాయల్ ఛాలెంజర్స్ జట్టు రాబిన్ ఊతప్ప తమ ఫ్రాంచైజీలోకి రావాలని ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కోరడంతో పై మార్పు తప్పనిసరి అయింది.దీంతో... ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీలు ఎలాంటి పారితోషికాలు లేకుండానే ఇద్దరు ఆటగాళ్లను పరస్పరం మార్చుకున్నాయి. కాగా, ఇంతకుముందు కూడా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆశీష్ నెహ్రాను, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు శిఖర్ ధావన్‌తో మార్చుకున్న సంగతి తెలిసిందే.ఆటగాళ్ల మార్పు విషయమై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ... పై రెండు మార్పులతో జట్టు సమతుల్యంలో ఎలాంటి మార్పూ రాలేదని స్పష్టం చేశారు. |