కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిప్ ఇంజురీతో బాధపడుతున్న ఫ్లింటాఫ్ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. బార్బడాస్‌లో ఈనెల 26వ తేదీ ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.
మూడో టెస్టు జరుగుతున్న సమయంలో ఫ్లింటాఫ్‌కు గాయమైంది. ప్రస్తుతం ఇది పెద్దది కావడంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ గాయం వల్ల ఐపీఎల్ టోర్నీకి కూడా ఈ ఆల్‌రౌండర్ దూరం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్లింటాఫ్‌ను 1.55 మిలియన్ డాలర్లుకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.
ఈ గాయం వల్ల బౌలింగ్ చేయడం కష్టతరమవుతుందని వైద్యుల అభిప్రాయపడుతున్నారు. దువల్ల ఐపీఎల్ టోర్నీకి కూడా ఫ్లింటాఫ్ దూరం కావచ్చని భావిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ బోర్డు మాత్రం ఫ్లింటాఫ్ త్వరగా కోనుకుని ఐదో టెస్టు (చివరి), వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావిస్తోంది.
చివరి టెస్టు ట్రినిడాడ్‌లో జరుగతుంది. 31 సంవత్సరాల ఆల్‌రౌండర్ జట్టుకు దూరం కావడంతో జట్టుకు తీరని నష్టంగా భావిస్తున్నారు. అందువల్లే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు అంజాద్ ఖాన్, రవి బొపొరాలకు చోటు కల్పించాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మాత్రం, ఫ్లింటాఫ్ లేక పోయినా తమ జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. |