కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన ఆకాష్ చోప్రా, సంజయ్ బంగర్‌లు సోమవారం స్వదేశానికి రానున్నారు. జట్టు అవసరాలకు సరిపడే విధంగా వారిద్దరు ఫిట్‌గా లేరని అందువల్ల స్వదేశానికి పంపాలని కేకేఆర్ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. దీనిపై ఆ జట్టు సీఈఓ జాయ్ భట్టాచార్యా మాట్లాడుతూ ఈ నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్‌లో చర్చించి తీసుకోగా, ఆటగాళ్లు కూడా అంగీకరించారని చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరు చాలా మంచి క్రికెటర్లు. వారికి మ్యాచ్‌లు ఆడే ఛాన్స్‌లు ఇవ్వకుండా జట్టుతో కొనసాగించడం భావ్యం కాదని భావించాం. అందువల్ల ఆ ఇద్దరు క్రికెటర్లను స్వదేశానికి పంపాలని నిర్ణయించామని, వీరు సోమవారం విమానమెక్కుతారని చెప్పారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిని 11 మందికి కుదించినట్టు చెప్పారు. దీన్ని ఇంకా తగ్గించే అవకాశం లేదన్నారు. రెండు మ్యాచ్‌లలో ఆడేందుకు చోప్రాకు అవకాశం దక్కగా, ఒకసారి మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. బంగర్‌కు కూడా ఒకసారి అవకాశం రాగా, కేవలం రెండు పరుగులు మాత్రమే చేశారు. |