జూలై నెలలో ప్రారంభం కానున్న యాషెస్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు స్పిన్ బౌలింగ్‌ను.. విజయం కోసం ప్రయోగించే అవకాశముందని ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.యాషెస్ సిరీస్‌లో భాగంగా.. ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్‌ను ప్రయోగించినట్లైతే సులభంగా విజయం సాధించడం ఖాయమని వార్న్ తెలిపాడు. ఇప్పటికే ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్ బౌలర్లను కలిగి ఉందని వార్న్ గుర్తు చేశాడు. 2006-07 లో జరిగిన యాషెస్ సిరీస్‌లో, ఆస్ట్రేలియా 5-0 తేడాతో ఆధిక్యంలో నిలిచిందని షేన్ వార్న్ గుర్తు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్పిన్ బౌలింగ్‌ను ప్రయోగిస్తుందని, ఇదే క్రమంలో ఇంగ్లండ్ కూడా స్పిన్ బౌలింగ్ ఉపయోగించినట్లైతే ఇంగ్లండ్‌కు విజయం చేకూరుతుందని షేన్ వార్న్ అన్నాడు. ఇంగ్లండ్ జట్టులో గ్రేమ్స్ స్వాన్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్, లెఫ్ట్ ఆర్మర్ మాంటి పనేసర్ వంటి స్నిన్నర్లున్నారని షేన్ వార్న్ గుర్తు చేశాడు. అదేవిధంగా యాషెస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులోనూ పిలిప్ హగ్స్, సైమన్ కాటిచ్, మైక్ హస్సీ వంటి అద్భుత ఆటగాళ్లున్నారని వార్న్ తెలియజేశాడు. |