ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆతిథ్యానికి అబుదాబి రెడీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆతిథ్యానికి అబుదాబి రెడీ
Ball
FileFILE
2011 ప్రపంచకప్ మ్యాచ్‌లు సహా పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ మ్యాచ్‌లకు తమ దేశం ఆతిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అబుదాబి క్రికెట్ అధికారులు ప్రకటించారు. భద్రత కారణాల వలన ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రద్దు చేయడంతో.. ఈ మ్యాచ్‌లను తటస్థవేదికలు నిర్వహించాల్సని ఇప్పటికే పాక్ ప్రతిపాదించింది.

అయితే పాక్‌కు ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను రద్దు చేస్తూ మ్యాచ్‌లను షెడ్యూల్ ప్రకారం భారత్‌, బంగ్లాదేశ్‌లలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. కానీ, తటస్థ వేదికలపై ఈ మ్యాచ్‌లను నిర్వహించాలన్న పాక్ ప్రతిపాదన..ఈ నేపథ్యంలో.. తమ దేశంలో ఆ మ్యాచ్‌లను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అబుదాబి క్రికెట్ అధికారులు ప్రకటించడం గమనార్హం.

ఈ విషయమై.. అబుదాబి క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిలావర్ మణి విలేకరులతో మాట్లాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పాక్‌కు సాయం చేయాలని తాము అనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, అబుదాబిలో షెడ్యూల్ ప్రకారం వచ్చే వారం పీసీబీ చీఫ్ ఇజాజ్ భట్‌తో మణి సమావేశం కానున్నారు. తటస్థ వేదికల్లో పాకిస్థాన్ ఆతిథ్యపు ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించే అంశంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బ్యాట్సమెన్, బౌలర్లపై కుంబ్లే ప్రశంసలు వర్షం
ఐపీఎల్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా చేస్తాం: మోడీ
ఫైనల్ బెర్త్ కోసం నేడు బెంగుళూరు, కింగ్స్ ఢీ
ప్రారంభ హనుమంత్ సింగ్ ట్రోఫీకి రంగం సిద్ధం
టెస్ట్ క్రికెట్‌కు టీ- 20కి ఎంతో తేడా ఉంది: గిల్లీ
యాషెష్‌కు డ్రైనేజ్ పని చేస్తుంది: ఈసీబీ