టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవం ఎదురైనప్పటికీ.. వన్డేల బలహీనత ఉన్న ఆండ్రూ స్ట్రాస్ జట్టును మట్టికరిపించి తద్వారా ప్రతీకారం తీర్చుకుంటామని వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. తామేంటో నిరూపించుకోవడానికి వన్డే సిరీస్ రూపంలో ఇంకా ఒక అవకాశం మిగిలి ఉందని గేల్ గుర్తు చేశాడు.బ్రిస్టోల్‌లో గేల్ విలేకరులతో మాట్లాడుతూ... మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయిందన్నాడు. కానీ ఆదివారం బ్రిస్టోల్‌లో, మంగళవారం ఎడ్బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లు అసంతృప్తికరంగా సాగాయని వివరించాడు.ఏది ఏమైనప్పటికీ.. ఇంగ్లాండ్ ఏ జట్టునైనా ఓడించగల స్థాయికి చేరుకుంది. కానీ కొన్ని సార్లు వన్డే క్రికెట్‌లో వారి పేలవ ప్రదర్శనను తమకు అనుకూలంగా మార్చుకుంటామన్నాడు. దానినే తమ బలంగా చేసుకుంటామని తెలిపాడు. అదలా ఉంచితే.. ఈ ఏడాది ఆరంభంలో కరేబియన్ దీవుల్లో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. అయితే... పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చతికిలబడుతుందని గేల్ వ్యాఖ్యానించడం గమనార్హం. |