బ్రిస్టల్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యత సాధించింది. సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌లో పాల్ కాలింగ్‌వుడ్ (47 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
కాలింగ్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు, బ్యాట్‌తోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 161 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 36 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రవి బొపారా (43), ఓవైష్ షా 38), మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాలింగ్‌వుడ్ (47) రాణించడంతో ఇంగ్లాండ్ సునాయస విజయాన్ని దక్కించుకుంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.3 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌటయింది. బ్రావో (50) అర్ధసెంచరీతో రాణించగా, గేల్ (31), చందర్‌పాల్ (27) ఓ మోస్తారుగా రాణించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు వికెట్లు, కాలింగ్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్, బ్రెస్నాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్‌లో చివరి, మూడో వన్డే మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. |