డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈసారి జరిగే ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ఫేవరెట్ కాదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు జహీర్ అబ్బాస్, వసీం అక్రం అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీకి వచ్చేసరికి భారత ఆటగాళ్లు బాగా అలిసిపోయి ఉంటారని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతున్న భారత ఆటగాళ్లు బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి టైటిల్ గెలుచుకోలేరన్నారు.
ప్రపంచకప్ వంటి టోర్నమెంట్‌లో ఫెవరెట్లు ఎవరూ లేరని వారు చెప్పారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వీటిలో ఏదైనా కప్‌ను కైవసం చేసుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ మితిమీరిన క్రికెట్ ఆడింది. ప్రపంచకప్ సమయానికి అలిసిపోయి ఉంటుందని అబ్బాస్ చెప్పారు. ఎడతెరిపిలేని క్రికెట్ ఆడిన కారణంగా భారత ఆటగాళ్లు ప్రపంచకప్‌లో సమస్యలు ఎదుర్కోవచ్చని అక్రం అభిప్రాయపడ్డారు. |