ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూలంగా ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు బాగా పెరిగాయని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ వలన వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు మరిన్ని ప్రత్యామ్నాయాలు దొరికాయని చెప్పాడు.
ఐపీఎల్‌లో పార్ట్‌టైమ్ బౌలర్లు రాణించడంపై ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అనుభవం ట్వంటీ-20 ప్రపంచకప్‌లో టీం ఇండియా మెరుగైన స్థితిలో ఉంచుతుందని ధోనీ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది ఐపీఎల్ టీం ఇండియా ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో, వన్డే క్రికెట్‌లో రాణించేందుకు బాగా ఉపయోగపడిందని తెలిపాడు.
అదే విధంగా ఈ ఏడాది టోర్నమెంట్ కూడా తమను మరింత ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ రెండో సీజన్‌లో కొంత మంది పార్ట్‌టైమ్ బౌలర్లు హ్యాట్రిక్‌లు సాధించారు. వారు ప్రపంచకప్‌లో ఎంతో ఉపయోగకరంగా ఉంటారని చెప్పాడు. |