వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరగనున్న ట్వంటీ- 20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అనూహ్యంగా చోటుకోల్పోయాడు. ప్రపంచకప్ జట్టులోకి అక్తర్ స్థానంలో రావ్ ఇఫ్తీకార్ వచ్చాడు. గజ్జల్లో గాయం కారణంగా అక్తర్‌ను గత వారం ప్రపంచకప్ జట్టు నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పించింది.
అక్తర్ స్థానంలో మరో ఆటగాడికి చోటు కల్పించేందుకు అనుమతించాలని పీసీబీ ప్రపంచకప్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది. ట్వంటీ- 20 ప్రపంచకప్ సాంకేతిక కమిటీకి ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అక్తర్ స్థానంలో రావ్ ఇఫ్తీకర్‌ను చేరుస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో ప్రపంచకప్ ట్వంటీ- 20 టోర్నమెంట్ మొత్తం మ్యాచ్‌లకు అక్తర్ దూరమయ్యాడు.
ఇంగ్లాండ్ ఆతిథ్య ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు గ్రూపు బిలో ఉంది. ఈ గ్రూపులో నెదర్లాండ్స్, ఇంగ్లాండ్‌లు ఇతర జట్లుగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ జూన్ 5న ప్రారంభం అవుతుంది. నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు వెళతాయి. ఫిట్‌నెస్, డోపింగ్, క్రమశిక్షణారాహిత్యం కారణంగా గడిచిన మూడేళ్లలో అక్తర్ నాలుగు ఐసీసీ టోర్నీలకు దూరమయ్యాడు. |