ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > యువకులే మా విజయానికి కారణం: గిల్‌క్రిస్ట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యువకులే మా విజయానికి కారణం: గిల్‌క్రిస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ కప్‌ను కైవసం చేసుకోవడం వెనుక యువశక్తే కారణమని డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపాడు. జట్టు అద్భుత ప్రదర్శనకు యువ ఆటగాళ్లు రాణించడమే కారణమన్నాడు. గత ఏడాది ఐపీఎల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ ఈసారి ఏకంగా కప్‌నే సొంతం చేసుకుంది.

ఈ సీజన్‌‍లో తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన మంచి ఊపుమీద కనిపించిన డెక్కన్ ఛార్జర్స్ మధ్యలో తడబడ్డారు. అయితే చివర్లో కీలకమైన మ్యాచ్‌లు నెగ్గుతూ ఫైనల్స్‌కు చేరారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకున్నారు.

ఈ మ్యాచ్ విజయం అనంతరం గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ఫైనల్స్ మరోలా ముగిసి ఉండాల్సిందన్నాడు. ఓజా అద్భుతంగా ఆడాడు. మనీష్ పాండే, వాండెర్‌మెర్వ్ వికెట్లు పడగొట్టి ఓజా ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడని, లేకుండా మ్యాచ్ మరోలా ముగిసి ఉండేదని గిల్లీ పేర్కొన్నాడు. హర్మీత్ తమకు "గోల్డెన్ బాయ్‌"లాంటి వాడన్నాడు. అతను ఆడిన ఏడు మ్యాచ్‌లు తాము గెలిచామని చెప్పాడు.

ఈ రోజు రాత్రి జరిగిన మ్యాచ్ తీవ్ర ఒత్తిడిలో సాగింది. అయినా హర్మీత్ బాగా బౌలింగ్ చేశాడు. చివర్లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. తమకు ఇలాంటి యువ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. నేర్చుకునేందుకు, అభివృద్ధి చెందేందుకు వారు ఆకలిమీద ఉన్నారని గిల్లీ చెప్పాడు. ఈసారి ఐపీఎల్‌లో హర్మీత్ సింగ్, ఓజాలాంటి ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారని తెలిపాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ట్వంటీ- 20 జట్టులో అక్తర్ స్థానంలో ఇఫ్తీకార్
ట్వంటీ- 20లో అనుభవం కూడా అవసరం: కుంబ్లే
బౌలింగ్ ప్రత్యామ్నాయాలు పెరిగాయి: ధోనీ
అక్టోబర్‌లో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ- 20: మోడీ
భారత్ ఫేవరెట్ కాదు: అబ్బాస్, వసీం అక్రం
రెండో వన్డేలో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ విజయం