ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ఇంగ్లండ్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది: హడ్డిన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంగ్లండ్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది: హడ్డిన్
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హడ్డిన్ హెచ్చరించాడు. జూలై 8వ తేదీ నుంచి జరుగనున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ధీటుగా రాణిస్తుందని హడ్డిన్ ధీమా వ్యక్తం చేశాడు.

మెక్‌గ్రాత్, షేన్‌వార్న్‌ల వంటి బౌలింగ్‌ దిగ్గజాలు జట్టులో లేకపోయినప్పటికీ యాషెస్ సిరీస్‌లో ఆసీస్ తప్పకుండా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తుందని హడ్డిన్ నమ్మకం వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌తో అద్భుతమైన బౌలింగ్ ప్రమాణాలతో రాణించిన హడ్డిన్‌, ఆస్ట్రేలియా క్రికెట్ ముందడుగు వేస్తుందని తెలిపాడు.

బౌలింగ్, బ్యాటింగ్ విధానాల్లో సరికొత్త మెళకువలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేర్చుకుంటున్నారని హడ్డిన్ వెల్లడించాడు. అంతేగాకుండా.. ఆసీస్ జట్టులో యువ క్రికెటర్లున్నారని, తప్పకుండా యాషెస్ సిరీస్‌లో విజయం సాధిస్తుందని హడ్డిన్ ఉద్ఘాటించాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడిన రికీ పాంటింగ్
టీ-20 ప్రపంచకప్ భారత్‌దే: సచిన్
ట్వంటీ-20 ప్రపంచ కప్ మాదే: పాక్ కోచ్
టీ20లో అంతగా ఆడలేను: పీటర్సన్
ఇంగ్లండ్‌కు చేరుకున్న భారత క్రికెట్ జట్టు
భారత్ అవకాశాలపై 'అలసట' ప్రభావం: వెంగీ