ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శనపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండో ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను గ్రేమ్ స్మిత్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా బృందం కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు.
దక్షిణాఫ్రికా ప్రపంచకప్ కైవసం చేసుకునేందుకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నాడు. వారి జోరు చూస్తుంటే ఆపటం కష్టమనిపిస్తోంది. దక్షిణాఫ్రికా జట్టు ప్రమాణాలు బాగా మెరుగుపడ్డాయని, తమ జట్టు ఈ స్థాయిలో ఆడటం చూసి చాలాకాలం అయిందని డొనాల్డ్ పేర్కొన్నాడు.
ఇప్పటికే దక్షిణాఫ్రికా ట్వంటీ- 20 సెమీస్‌లో చోటు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టోర్నీలో ఒక్క పరాజయం కూడా ఎదురుకాలేదు. సూపర్ ఎయిట్ దశలో ఇప్పటికే రెండు విజయాలు సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా మంగళవారం జరిగే చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీం ఇండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా దక్షిణాఫ్రికా సెమీస్‌లో చోటు ఖాయం చేసుకుంది. |