ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు సూపర్ ఎయిట్ దశ నుంచి వెనుదిరిగింది. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. ఈ పరాజయంతో ఇంగ్లాంట్ జట్టు టోర్నమెంట్ సెమీస్ అవకాశాలు చేజార్చుకుంది.
ఈ నేపథ్యంలో కాలింగ్‌వుడ్ మాట్లాడుతూ.. జట్టు కెప్టెన్సీ బాధ్యతల్లో కొనసాగడంపై నిరాసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతల్లో కొనసాగుతానని తాను స్పష్టంగా చెప్పలేనని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. మళ్లీ మేము ట్వంటీ- 20 మ్యాచ్ ఎప్పుడు ఆడతామో తెలియదు.
ఈ ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్‌గా ఉంటానో లేదో కూడా తెలియదని కాలింగ్‌వుడ్ చెప్పాడు. దీని గురించి ఎటువంటి ఆలోచన లేదన్నాడు. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ నుంచి మధ్యలోనే వెనుదిరగడం తీవ్రంగా నిరాశపరించిందన్నాడు. గత రాత్రి వర్షం కారణంగా అంతరాజయం ఏర్పడిన సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగా, అనంతరం రెండుసార్లు వర్షం అంతరాజయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విండీస్‌కు తొమ్మిది ఓవర్లలో 80 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మ్యాచ్ పరాజయం అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ మాట్లాడుతూ.. తమ జట్టు ప్రపంచకప్ గెలవాలనే కల నెరవేరాలంటే మరిన్ని ట్వంటీ- 20 మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. |