ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > కిర్‌స్టన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీసీఐ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కిర్‌స్టన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కూడా ఓ ప్రధాన కారణమని టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. జట్టు ప్రదర్శనను ఐపీఎల్‌తో ముడిపెట్టడంపై మండిపడింది.

టోర్నమెంట్‌లో ఆడలేని స్థితిలో లేదా అలిసిపోయి ఉన్న ఆటగాళ్లు తమకు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేసి ఉండాల్సిందని బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ మీడియా, ఆర్థిక మిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. గాయపడిన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు బోర్డు వద్ద కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు.

కీలక ఆటగాళ్లు గాయాలతో ఉండటం జట్టు పూర్తిస్థాయిలో రాణించలేకపోయిందని కిర్‌స్టన్ చెసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఆడలేనివారు బోర్డుకు ఆ విషయాన్ని తెలియజేసే స్వేచ్ఛ ఉంది. తాము ఏ టోర్నీలోనూ కచ్చితంగా ఆడాలని ఏ ఆటగాడిని బలవంతపెట్టడం లేదు. ఆడలేనివారి స్థానాలు భర్తీ చేసేందుకు బీసీసీఐ వద్ద ప్రత్యామ్నాలు చాలా ఉన్నాయని శుక్లా పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్లను ఎంపిక చేశారు: ధోనీ
టీం ఇండియాకు ఐపీఎల్ శాపమైందా.. !
కెప్టెన్సీని వదులుకోనున్న కాలింగ్‌వుడ్?
పాక్‌కు ప్రపంచకప్ ఫీజుల్లో వాటా కొనసాగింపు
కిర్‌స్టన్‌వి కుంటిసాకులంటూ ఎదురుదాడి
టెస్ట్ క్రికెటే కీలకం: సచిన్ టెండూల్కర్