తొలి మహిళ టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు తమ జట్టు చేరుతుందని భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ పేర్కొన్నారు. శ్రీలంకతో జరిగిన చివరి లీగ్‌లో మిథాలీ అద్భుతంగా ఆడి 22 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చిన సంగతి తెలిసిందే.
శ్రీలంకపై 32 పరుగులే చేసినా తన కెరీర్‌లో ఇదొక బెస్ట్ ఇన్నింగ్స్ అని 26 ఏళ్ల మిథాలీ మ్యాచ్ అనంతరం వెల్లడించింది. టెస్టులో తాను చేసిన డబుల్ సెంచరీతో టి- 20 ఇన్నింగ్స్‌లను పోల్చడం తగదన్నారు.
సెమీస్‌లోనూ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేరుస్తానని మిథాలీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సెమీస్‌లో భారత మహిళల జట్టు టైటిల్ ఫేవరెట్ న్యూజిలాండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జిలో తలపడనుంది. |