త్వరలో జరగబోయే వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు ముంబయిలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం సమావేశమవుతుంది. వెస్టిండీస్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూన్ 26న ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే.
దీని కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్, ఆయన సహచరుడు రాజా వెంకట్‌లు బుధవారం టెలికాన్ఫెరెన్స్‌లో ఇతర సభ్యులతో చర్చలు జరుపుతారు. అనంతరం ఈ టూర్ కోసం జట్టును ప్రకటిస్తారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్- వెస్టిండీస్‌ల మధ్య జరిగే వన్డే సిరీస్‌లో జూన్ 26, 28 తేదీల్లో జరిగే తొలి రెండు మ్యాచ్‌లు జమైకాలో, జులై 3, 5న జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లు సెయింట్ లూసియాలో జరుగుతాయి. |