ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > బ్యాటింగ్ వైఫల్యమే పరాజయానికి కారణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బ్యాటింగ్ వైఫల్యమే పరాజయానికి కారణం
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో జట్టు సూపర్ ఎయిట్ నుంచి ఇంటిముఖం పట్టడానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ విటోరీ తెలిపాడు. తాజా ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. ఈ రెండు విజయాలు కూడా చిన్న జట్లపై సాధించనవే.

ఒక్క ప్రధాన జట్టుపై కూడా విజయం సాధించలేకపోవడానికి, జట్టు అర్ధాంతరంగా టోర్నీ నుంచి వెనుదిరగడానికి బ్యాటింగ్ వైఫల్యాలే కారణమని చెప్పాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ పరాజయంతో సెమీస్ అవకాశాలను న్యూజిలాండ్ కోల్పోయింది.

దీనిపై విటోరీ మాట్లాడుతూ.. తమకు టోర్నమెంట్‌లో అదృష్టవశాత్తూ సులభమైన డ్రా లభించిందని, దీని వలన రెండు చిన్న జట్లపై విజయాలు సాధించగలిగామన్నాడు. విటోరీ, రాస్ టైలర్, జెస్సీ రైడర్‌లకు గాయాలతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ, తమ వైఫల్యానికి ఆటగాళ్ల గాయాలు కారణం కాదన్నాడు.

శ్రీలంకతో తాజా మ్యాచ్‌ను కోల్పోవడానికి కారణం కూడా ఇది కాదన్నాడు. ప్రధాన జట్లతో ఆడినప్పుడు తమ బ్యాట్స్‌మెన్ పూర్తి స్థాయిలో రాణించలేదు. ప్రధాన జట్లపై తమ అత్యధిక స్కోరు 127. దీనిని బట్టి చూస్తే తమ బ్యాటింగ్ ప్రదర్శన సరిగాలేదనే విషయం తెలుస్తుందన్నాడు. ఇదిలా ఉంటే తాజా టోర్నీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా, శ్రీలంక ఆడతాయని విటోరీ జోస్యం చెప్పాడు.

ఈ రెండు జట్లు ఆటను వైవిధ్యమైన కోణాల్లో ఆడుతున్నాయి. దక్షిణాఫ్రికా క్రమశిక్షణ, ప్రతిభను నమ్ముకుంటే, స్వేచ్ఛగా ఆడే బ్యాట్స్‌మెన్, బౌలర్లు శ్రీలంకను ముందుకు నడిపిస్తున్నారని విటోరీ పేర్కొన్నాడు. అందువలన ఈ రెండు జట్లు ఫైనల్స్‌కు వస్తాయని భావిస్తున్నాను. ఈ రెండు జట్లతో ఫైనల్స్ జరిగితే ఆ మ్యాచ్ అద్భుతం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వెస్టిండీస్ టూర్‌కు నేడు భారత జట్టు ఎంపిక
ట్వంటీ- 20 ఫైనల్స్‌లోకి వెళతాం: మిథాలీ
వెస్టిండీస్ టూర్‌కు టెండూల్కర్ అనుమానం
కిర్‌స్టన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీసీఐ
ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్లను ఎంపిక చేశారు: ధోనీ
టీం ఇండియాకు ఐపీఎల్ శాపమైందా.. !